అతడో రౌడీషీటర్. ఓ హత్య కేసులో బెంగళూరులోని పరప్పన్ అగ్రహార్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇక జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. నిత్యం ప్రహారా ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఓ రౌడీషీటర్ గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Cough syrup Alert: దగ్గు సిరప్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల
రౌడీషీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సినా ఓ హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన్ అగ్రహార్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. అయితే జైల్లోనే తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. సహచర ఖైదీలంతా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక యాపిల్ కాయలు కలిగిన ఒక దండను మెడలో వేసి ఈలలు, కేరింతలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఒక పెద్ద కత్తితో రౌడీషీటర్ కేక్ కట్ చేశాడు. ఈ దృశ్యాలను సహచర ఖైదీలు మొబైల్‌లో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్‌లో వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Trump: బిన్ లాడెన్‌ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు.. నేవీ సీల్స్‌పై ట్రంప్ ప్రశంసలు
అయితే ఈ వీడియో ప్రత్యర్థి భార్య సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జైలు శాఖ, పోలీసు శాఖ అప్రమత్తమైంది. వాస్తవంగా జైల్లో ఖైదీలకు మొబైల్స్ అనుమతి ఉండదు. ఇక బర్త్ డే వేడుకలు కూడా జరుపుకోవడానికి అనుమతి ఉండదు. అలాంటి జైల్లో ఇంత గ్రాండ్‌గా వేడుకలు ఎలా జరుపుకున్నారని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వేడుకలు చాలా రోజుల కిందట జరిగినా కూడా.. అసలు ఇలా జరుపుకోవడానికి పోలీసులెవరు సహకరించారని అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో 4-5 నెలల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. గతంలో అభిమానిని చంపిన కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్ కూడా ఇలాంటి సౌకర్యాలే పొందాడు. వీడియో కాల్‌లో బంధువులతో మాట్లాడిన దృశ్యాలు రావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణకు అధికారులు ఆదేశించారు. రౌడీషీటర్ చేతిలో హత్యకు గురైన బాధిత మహిళనే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.