Site icon NTV Telugu

PM Modi: శశిథరూర్‌ నా పక్కన నిలబడడంతో నిద్రపట్టదేమో.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్

Modi

Modi

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు. బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. శశిథరూర్ సభా వేదికపైన కూర్చున్నారు. ఈ కార్యక్రమం చూసిన కొంత మందికి నిద్రకు భంగం కలిగిస్తుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్

గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధాని మోడీని శశిథరూర్‌ స్వయంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన మోడీని సాదరంగా స్వాగతించా’’ అని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: Air India: ఉద్రిక్తతల కారణంగా ఎయిరిండియాకు రూ.5 వేల కోట్ల నష్టం!

గత కొద్ది రోజులుగా శశిథరూర్ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ పెద్దలతో కలిసి తిరుగుతున్నారు. తన అవసరం లేకపోతే చెప్పాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను శశిథరూర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన కాషాయ గూటికి చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మోడీతో కలిసి ఉండడంతో శశిథరూర్ వార్త హల్‌చల్ చేస్తోంది.

తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విజింజం ఇంటర్నేషనల్‌ డీప్‌వాటర్‌ మల్టీపర్పస్‌ సీపోర్టును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, తదితర నేతలంతా పాల్గొన్నారు.

 

Exit mobile version