NTV Telugu Site icon

Delhi: ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు

Droupadimurmutour

Droupadimurmutour

ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.

ఇది కూడా చదవండి: Gujarat: రెండేళ్ల క్రితం బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

ఈ సదసులో ప్రధానంగా నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీలు అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష మాకే నామ్, సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయం వంటి కీలక అంశాలపై రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. గవర్నర్లతో విడివిడిగా బృందాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక అంశాలపై ప్రజెంటేషన్ జరగనుంది.

ఇది కూడా చదవండి: Myanmar: సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి టిక్‌టాక్ స్టార్ మృతి

ఇదిలా ఉంటే ఆగస్టులో ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. 5-10 వరకు మూడు దేశాల్లో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్ లెస్టేలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఇండియా నుంచి దేశాధినేత ఫిజీకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇది కూడా చదవండి: MESC : సినిమా టెక్నికల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్.. ఎలా తీసుకోవాలంటే?

Show comments