Site icon NTV Telugu

Droupadi Murmu: సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Resident Droupadi Murmu

Resident Droupadi Murmu

Droupadi Murmu: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం లీడర్ ద్రౌపది ముర్ము భారత వాయుసేన ఫైటర్ జెట్ సుఖఓయ్-30 MKIలో తొలిసారి ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శనివారం యుద్ధవిమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్ పూర్ లోని భారత వాయుసేన ఎయిర్ బేస్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భద్రత బలగాలు సైనిక వందనం సమర్పించాయి.

Read Also: BJYM Bhanu Prakash : అవినీతికి కేరాఫ్ గా కేసీఆర్ మారారు

అనంతరం ఆమె ప్లయంగ్ సూట్ ధరించి సుఖోయ్ 30 విమానంలో కొద్ది సేపు విహరించారు. ఆ సమయంలో బ్రహ్మపుత్ర, తేజ్‌పూర్ లోయలను చూశారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. కాగా అంతకుముందు 2009లో భారత తొలి మహిళ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధవిమానంలో ప్రయాణించారు. ఆమె 2009లో పూణే ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి సుఖోయ్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి గత గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవార కజిరంగ నేషనల్ పార్క్ లో జరిగిన గజ్ ఉత్సవ్ ను ఆమె ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా మౌంట్ కంచనజంగ సాహసయాత్ర-2023ని కూడా ఆమె ప్రారంభించారు.

Exit mobile version