NTV Telugu Site icon

President Droupadi Murmu: క్వీన్ ఎలిజబెత్-2కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu

President Droupadi Murmu

President Draupadi Murmu pays tribute to Queen Elizabeth II: భారతప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే రాణి ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించారు. ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం లండన్ వెళ్లారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు యూకేలో అధికారిక పర్యటనలో ఉన్నారు. సోమవారం జరిగే క్వీన్ ఎలిజబెత్ అంతక్రియలకు ఆమె హాజరుకానున్నారు. క్వీన్ అంత్యక్రియల్లో హజరుకావడానికి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్‌లో క్వీన్ ఎలిజబెత్ II కోసం సంతాప పుస్తకంపై సంతకం చేశారు. సోమవారం అంత్యక్రియలకు ముందు లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో విదేశీ నాయకుల కోసం కింగ్ చార్లెస్ 3 ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరు అవుతారు. క్వీన్ ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ యూకే దేశాధినేతగా, కామన్వెల్త్ దేశాల అధిపతిగా ఉన్నారు.

Read Also: Alluri Pre Release Event: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్ (లైవ్)

క్వీన్ ఎలిజబెత్ మరణంపై ప్రపంచదేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోదీ రాణి మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాణి మరణంపై సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా ఒక రోజు జాతీయ సంతాపదినంగా పాటించింది. రేపు జరగబోతున్న క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 500 మందికి పైగా విదేశాలకు సంబంధించిన నేతలు హాజరుకానున్నారు. యూఎస్ఏ అధినేత జో బిడెన్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల ప్రధానులు కూడా హజరుకానున్నారు. మొత్తంగా 2000 మంది ప్రముఖులు రాణి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. రష్యా, బెలారస్, మయన్మార్, ఆప్ఘనిస్తాన్, సిరియా మినహా మిగతా దేశాలను యూకే రాణి అంత్యక్రియల కోసం ఆహ్వానించింది.