Prashant Kishor: బీజేపీలోకి ప్రశాంత్ కిషోర్.. నిజం ఏంటంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. బీజేపీ అతడిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించిందనే సోషల్ మీడియా స్క్రీన్ షాట్లు కలకలం రేపుతున్నాయి. అయితే, బీజేపీ విడుదల చేసినట్లు చెబుతున్న లేఖ ఫేక్ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత జై రాంరమేష్‌పై ఫైర్ అయింది. ఫేక్ ఇమేజ్‌ని ఆయన షేర్ చేశాడని ఆరోపించింది.
Read Also: CEO MK Meena: పిన్నెల్లి వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు: సీఈవో
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
‘‘కాంగ్రెస్, రాహుల్ గాంధీ, మీరంతా ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతూ బాధితులమని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరే చూడండి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్, సీనియర్ నేత జైరాం రమేష్ వ్యక్తిగతంగా ఈ నకిలీ డాక్యుమెంట్‌ని ఎలా సర్య్కూలేట్ చేస్తున్నారో..’’ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది. ఫేక్ బీజేపీ లెటర్ ప్రకారం.. ప్రశాంత్ కిషోర్‌ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్లు చూపిస్తోంది. ఇది ఎక్స్, ఫేస్‌బుక్ వేదికగా విస్తృతంగా సర్క్యూలేట్ అయింది.
ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మళ్లీ నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లుగా సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమితో కలుపుకుని 400 సీట్లు రాకపోవచ్చని అన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లకు అటూ ఇటూ లేకుంటే కొద్దిగా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అంచనాలను కాంగ్రెస్, ఇండియా కూటమి తప్పుబడుతున్నాయి.
Look at the irony! @INCIndia, @RahulGandhi
You all talk about fake news and claim to be the victims. Now see yourself how the head of Communications of Congress Party, @Jairam_Ramesh, apparently a senior leader, is personally circulating a fake document.@delhipolice pic.twitter.com/NJFrKhznU9— Jan Suraaj (@jansuraajonline) May 22, 2024
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!