NTV Telugu Site icon

Prashant Kishor: బీజేపీలోకి ప్రశాంత్ కిషోర్.. నిజం ఏంటంటే.?

Pk

Pk

Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. బీజేపీ అతడిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించిందనే సోషల్ మీడియా స్క్రీన్ షాట్లు కలకలం రేపుతున్నాయి. అయితే, బీజేపీ విడుదల చేసినట్లు చెబుతున్న లేఖ ఫేక్ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత జై రాంరమేష్‌పై ఫైర్ అయింది. ఫేక్ ఇమేజ్‌ని ఆయన షేర్ చేశాడని ఆరోపించింది.

Read Also: CEO MK Meena: పిన్నెల్లి వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు: సీఈవో

‘‘కాంగ్రెస్, రాహుల్ గాంధీ, మీరంతా ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతూ బాధితులమని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరే చూడండి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్, సీనియర్ నేత జైరాం రమేష్ వ్యక్తిగతంగా ఈ నకిలీ డాక్యుమెంట్‌ని ఎలా సర్య్కూలేట్ చేస్తున్నారో..’’ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది. ఫేక్ బీజేపీ లెటర్ ప్రకారం.. ప్రశాంత్ కిషోర్‌ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్లు చూపిస్తోంది. ఇది ఎక్స్, ఫేస్‌బుక్ వేదికగా విస్తృతంగా సర్క్యూలేట్ అయింది.

ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మళ్లీ నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లుగా సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమితో కలుపుకుని 400 సీట్లు రాకపోవచ్చని అన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లకు అటూ ఇటూ లేకుంటే కొద్దిగా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అంచనాలను కాంగ్రెస్, ఇండియా కూటమి తప్పుబడుతున్నాయి.