Prashant Kishore criticizes Bihar Deputy CM Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. సొంత రాష్టమైన బీహార్ లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ఆయన తేజస్వీ యాదవ్ ని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించారు. బీహార్ వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్( సీటెట్)కి అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందిన విద్యావంతులు ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంటింటికి పడిగాపులు పడుతున్నారని.. చదువురాని రాజకీయ నాయకులు పిల్లలు మాత్రం ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని తేజస్వీ యాదవ్ ని ఉద్దేశించి విమర్శించారు.
Read Also: Minister Malla Reddy: నాయకులకు “చాయ్” ఇస్తున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్
10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేసిన ప్రభుత్వం టెట్, సీటెట్ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులపై లాఠీ చార్జి చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. పదో తరగతి పాస్ కాని వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నారని తేజస్వీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే బీజేపీ పొత్తును కాదని సీఎం నితీష్ కుమార్ జేడీయూ, ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ‘మహాఘట బంధన్’ కూటమిని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ తన తదుపరి నాయకుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తేజస్వీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మహాఘటబంధన్ కూటమికి నాయకత్వం వహిస్తారని నితీష్ కుమార్ అన్నారు. 2024లో విపక్షాల కూటమి మోదీ, బీజేపీని ఓడిస్తుందని.. తేజస్వీ నేతృత్వంలో 2025లో బీహార్ లో మళ్లీ అధికారాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ అన్నారు.
