NTV Telugu Site icon

Prashant Kishor: కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న పీకే..? సోనియా, రాహుల్‌తో భేటీ..

Prashant Kishor

Prashant Kishor

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్‌.. ఇక, పీకే కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోన్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోనియా-పీకే సమావేశంలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. అయితే, గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్టుగా కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నారు.. గుజ‌రాత్ పోల్స్‌పై చ‌ర్చించ‌డానికే ఈ భేటీ జ‌రిగిందని.. గుజ‌రాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నిక‌ల బ్లూప్రింట్‌పై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.. కాగా, 2024 సార్వత్రిక ఎన్నిక‌లతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచార‌ బాధ్యతలను కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌కు అప్పగిస్తుందనే ప్రచారం కూడా ఉంది..

Read Also: TDP: జగన్ కేసుల్లో సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం..!

ఇక, 2020లో కాంగ్రెస్‌లో చేరాలని ప్రశాంత్ కిషోర్ ముందస్తుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ, అనేక విషయాలపై విభేదాల కారణంగా ప్లాన్‌ వర్కవుట్ కాలేదు. అయితే, ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై చర్చించేందుకు ఇవాళ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోందని చెబుతున్నారు.. ఇటీవలి ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ హాజరు కావడం ప్రాధాన్యతగా మారింది.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంబికా సోనీ, దిగ్విజయ్‌ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఇక, మార్చిలో, ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీని కలిశారని గతంలో ప్రచారం సాగింది. రాహుల్, ప్రియాంకలతో ప్రశాంత్ కిషోర్ భేటీపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, ప్రశాంత్ కిషోర్ మళ్లీ పార్టీలో చేరుతున్నారనే సందడి మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది.