Site icon NTV Telugu

Prashant Kishor: ఈసారి నితీష్‌కుమార్‌కు జరిగేది ఇదే.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

Prashantkishor

Prashantkishor

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చివరి రాజకీయ ఇన్నింగ్స్‌లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓ జాతీయ మీడియాతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్‌ను తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎప్పటికీ అనుమతించబోదని అన్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ ఇంకా కొన్ని రోజులే ఉంటారన్నారు. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ఇకపై సాధ్యం కాదన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా.. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కారన్నారు. ఇక కేవలం నితీష్ కుమార్ 5 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Amit Shah: కాసేపట్లో తమిళనాడుకు అమిత్ షా.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!

2024, జనవరిలో కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. అనంతరం బీజేపీతో చేతులు కలిపి నితీష్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లినా.. ఈ సారి మాత్రం సీఎం పోస్టు వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది.

ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అవినీతి, వలసలు, పాలనా లోపం వంటి అంశాలపై తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి: Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీలో తహవూర్ రాణా.. నేడు ఈ అంశాలపై ప్రశ్నలు

Exit mobile version