Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు
- నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- పోరాటం కొనసాగుతుందని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీష్ కుమార్‌పై మరోసారి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల ఓట్లను రూ.10 వేలతో కొనుగోలు చేసి గెలిచారంటూ ధ్వజమెత్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహిళల ఓట్లను డబ్బుతో ప్రభావితం చేశారని ఆరోపించారు.
ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. “బీహార్ ఎన్నికలకు ముందు మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు కేవలం రూ.10 వేలే ఇచ్చి వారి ఓట్లను కొనుగోలు చేశారు. మహిళలను ఆకర్షించి వారి ఓట్లను ప్రభావితం చేశారు. ఈ అంశంపై జనసురాజ్ పార్టీ గతంలో కూడా గొంతెత్తింది.. ఇకపై కూడా పోరాడుతూనే ఉంటుంది” అని అన్నారు. అంతేకాకుండా నితీశ్ కుమార్‌పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించారు. “మహిళలకు రూ.2 లక్షల ఆశ చూపించి వారి ఓట్లు పొందిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయారు. రాష్ట్ర పాలనను తన పిల్లలు, సన్నిహితులు, అనుచరుల చేతుల్లో పెట్టారు” అని ఆరోపించారు.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
బీహార్‌లో అధికార పక్షం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని.. ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, ప్రజల సంక్షేమం కోసం జనసురాజ్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ, ఎన్డీయే కూటమి నేతలు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
#WATCH | West Champaran: Prashant Kishor, founder of Jan Suraaj Party, says, "Before the Bihar elections, women were lured with promises of Rs 2 lakh, but given only Rs 10,000 to influence their votes; their votes were bought. Jan Suraaj has raised its voice against this before… pic.twitter.com/mOet6CSbmN
— ANI (@ANI) June 6, 2026
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!