ట్రంప్ అమెరికాను నాశనం చేస్తున్నారని.. పన్నుల పేరుతో భారత్‌ను బెదిరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌ను బెదిరించేవారిని తాను సహించబోనని తెలిపారు. ప్రధాని మోడీ ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 29 సార్లు భారత-పాక్ యుద్ధాన్ని ఆపానుంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్ టారిఫ్‌పై శశిథరూర్ సూచన
బెట్టింగ్ యాప్స్ నిషేధించాలని ప్రధాని మోడీ, ఎంపీలకు లేఖ రాసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నిషేధంపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల 30 కోట్ల మంది ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేది ప్రజాశాంతి పార్టీనే అన్నారు. గద్దర్‌ను ప్రేమించినవారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.
ఇది కూడా చదవండి: Tollywood : అటు హీరోయిన్ ఇటు ఐటమ్ గర్ల్.. యంగ్ బ్యూటీకి ఫుల్ డిమాండ్
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే దీన్ని అన్యాయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికా బృందం ఈనెలలో భారత్‌లో పర్యటించనుంది. అప్పుడైనా అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.
