NTV Telugu Site icon

Sadhvi Pragya: నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళ్తా..

Sadvi

Sadvi

Sadhvi Pragya: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌(ట్విట్టర్)లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శించారు. హస్తం పార్టీ తనను చిత్రహింసకు గురి చేసిందన్నారు. ఏటీఎస్‌ కస్టడీకి పంపింది.. ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నట్లు సాధ్వి ప్రజ్ఞా తెలిపారు.

Read Also: Bandi Sanjay: భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..

అయితే, తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు కనిపిస్తోంది. కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలుగా ఉంది. వైద్య చికిత్స పేరుతో గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.. సాధ్వి ప్రజ్ఞా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం చెప్పుకొచ్చింది.

Read Also: Mumbai Actress Jathwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఐపీఎస్‌ అధికారులకు ఊరట..

ఇక, ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై పేర్లను రాయాలని డిమాండ్ చేసింది. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల షాప్స్ పై వారి పేర్లను రాసి ఉంచాలని కోరారు. అయితే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దుకాణుదారులు తమ పేర్లును తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.