Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. కొనసాగుతున్న పోస్టుమార్టం

Postmartam

Postmartam

Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎవియేషన్ ఇండస్ట్రీలోనే అత్యంత దారుణమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచింది. గురువారం నాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కి వెళ్తున్న విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. మెడికల్ హాస్టల్ భనవంపై కూలడంతో 24 మంది మెడికోలు మృతి చెందారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మొత్తంగా 265 మంది చనిపోయారు.

Read Also: Hari Hara Veeramallu: ఆ రోజునే హరిహర వీరమల్లు?

ఇక, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 265 మంది మృతదేహాలకు సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతుంది. అయితే, విమాన ప్రమాదంలో ఛిద్రమైన కొన్ని మృతదేహాలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తిస్తున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన తర్వాత వారి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను గుర్తించారు వైద్యులు.

Exit mobile version