NTV Telugu Site icon

Political parties income: పొలిటికల్ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్.. 6 జాతీయ పార్టీ వివరాలు..

Bjp

Bjp

Political parties income: కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఆదాయం పరంగా టాప్ ప్లేస్‌లో ఉంది. దేశంలో ఉన్న 6 జాతీయ పార్టీల ఆదాయాలను బట్టి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో కాషాయ పార్టీ నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 జాతీయ పార్టీలకు రూ. 3077 కోట్ల ఆదాయం వస్తే.. బీజేపీ ఏకంగా 76.77 శాతంతో రూ. 2361 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ.. అసోసియేషన్ ఫర్ డిమెక్రాటిక్ రిఫార్మ్స్(ADR) బుధవారం వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ రూ. 452.37 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మొత్తం 2022-23 పార్టీ ఆదాయంలో 14.70 శాతంతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా బీఎస్పీ, ఆప్, ఎన్‌పీపీ, సీపీఎం తమ ఆదాయాన్ని ప్రకటించాయి. 2021-22, 2022-23 మధ్య బీజేపీ ఆదాయం 23.15 శాతం అంటే రూ. 443.72కి పెరిగింది. రూ. 1917.12 నుంచి రూ. 2360.8 కోట్లకు చేరింది.

Read Also: Uttam Kumar Reddy: బీఆర్ఎస్ మేడిగడ్డకు పోవాలి.. క్షమాపణ చెప్పాలి

NPP ఆదాయం 1502.12 శాతం లేదా రూ. 7.09 కోట్లు పెరిగి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 47.20 లక్షల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.562 కోట్లకు చేరుకుంది. ఇదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదాయం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 44.53 కోట్ల నుంచి 91.23 శాతం పెరిగి 2022-23లో రూ. 85.17 కోట్లకు చేరుకుంది.

2021-22, 2022-23 మధ్య కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీల ఆదాయం వరసగా 16.42 శాతం (రూ. 88.90 కోట్లు), 12.68 శాతం (రూ. 20.575 కోట్లు) మరియు 33.8014 శాతం (రూ. 20.575 కోట్లు) తగ్గింది.