NTV Telugu Site icon

Bombay High Court: పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదు.. వీడియో చిత్రీకరణ నేరం కాదు..

Bombay High Court

Bombay High Court

Police Station Not A Prohibited Place Under Official Secrets Act: అధికారిక రహస్యాల చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదని.. పోలీస్ స్టేషన్ లో వీడియో చిత్రీకరణ నేరం కాదని కీలక తీర్పును వెల్లడించింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్. మార్చి 2018లో పోలీస్ స్టేషన్ లో వీడియో తీసిన నేరానికి రవీంద్ర ఉపాధ్యాయ్ అనే వ్యక్తిపై అధికారిక రహస్యాల చట్టం(ఓఎస్ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలైలో జస్టిస్ మనీష్ పితలే, వాల్మీకి మెనెజెస్ లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.

Read Also: Babloo Prithiveeraj: మేము పెళ్లి చేసుకోలేదు.. బాంబ్ పేల్చిన పృథ్వీ

తాజాగా ఈ కేసును కట్టేసింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్. అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3, 2(8)ని న్యాయమూర్తులు ప్రస్తావించారు. ఈ సెక్షన్ల ప్రకారం పోలీస్ స్టేషన్లు నిషేధిత స్థలాలు, సంస్థల్లో భాగం కాదని వెల్లడించింది కోర్టు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం ఆరోపించిబడిన వ్యక్తి ఏ నేరానికి పాల్పడలేదని తీర్పు వెల్లడించింది.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రవీంద్ర ఉపాధ్యాయ్ తన పొరుగువారితో వివాదం నేపథ్యంలో తన భార్యతో కలిసి వార్ధాలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సమయంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న చర్చలను ఉపాధ్యాయ్ తన ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇది గుర్తించిన పోలీసులు అతనిపై అధికారిక రహస్యాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడిస్తూ.. ఉపాధ్యాయ్ పై ఉన్న కేసును కొట్టేసింది.