చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఖాకీలే.. పక్కదారి పట్టి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును రికవరీ చేసి ఇదే అదునుగా భావించి ఓ పోలీస్ ప్రేమికుల జంట పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Tanushree Dutta: కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న స్టార్ హీరోయిన్.. దయచేసి కాపాడండి అంటూ.. వీడియో వైరల్
అంకుర్ మాలిక్ సబ్-ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సైబర్ కేసులను డీల్ చేయడంతో రికవరి పేరుతో భారీగా నగదు తిరిగి రావడం చూసి కన్నుగిట్టింది. అంతే సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన రూ.2 కోట్ల నగదును వేర్వేరు నకిలీ ఖాతాలు సృష్టించి మళ్లించాడు. అనంతరం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో అంకుర్ మాలిక్ బ్యాచ్‌కు చెందిన మరో మహిళా ఎస్సై నేహా పునియాతో ఎప్పుటినుంచో రహస్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బు చేతికి అందగానే మాలిక్.. ఏడు రోజులు సెలవు తీసుకున్నాడు. కానీ తిరిగి రాలేదు. ఇదే క్రమంలో పునియా కూడా విధులకు హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టి విచారణ జరపగా రూ.2 కోట్లతో ఇద్దరు పరారైనట్లుగా గుర్తించారు. దీంతో వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Deepika : దీపిక చూపు ఇప్పుడు టాలీవుడ్ వైపు..
మాలిక్-పునియా కలిసి గోవా, మనాలి, కాశ్మీర్ వంటి పర్యాటక ప్రాంతాల్లో విహరించారు. అయితే అప్పటికే ఢిల్లీ పోలీసులు వేటాడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా ఇండోర్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. నాలుగు నెలల తర్వాత జంటను అరెస్టైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారం, రూ.12 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు ఏటీఎం కార్డులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన డబ్బుతో జల్సాలు చేశారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ 2021లో పోలీసు శిక్షణ సమయంలో స్నేహితులయ్యారని.. అప్పటినుంచి ఇద్దరూ రకరకాలైన మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక మాలిక భార్య ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్‌లో నివసిస్తుండగా.. పునియా భర్త ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇక దొంగిలించిన డబ్బును ఖాతాల్లోకి బదిలీ చేసిన మరో ముగ్గురు వ్యక్తులు మహ్మద్ ఇలియాస్, ఆఫి అలియాస్ మోను, షాదాబ్‌ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: MLA Kolikapudi: తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా
