Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- ఉత్తర అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ నౌకలు ఢీ..
- చైనా ‘‘వ్యూహాలను’’అవలంభిస్తున్న పాకిస్తాన్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నేవీ, భారత నేవీని కవ్వించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ నేవీకి చెందిన పీఎన్ఎస్ హునైన్, భారత నేవీకి చెందిన కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్కు అత్యంత సమీపంలోకి వచ్చి, ఢీకొట్టింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 15న అంతర్జాతీయ జలాల్లో, గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌కు సుమారు 120 నాటికన్ మైళ్ల దూరంలో భారత్ యుద్ధనౌక సాధారణ మిషన్‌లో ఉండగా ఈ ఘటన జ రిగింది. పాకిస్తాన్ నౌక దెబ్బతినగా, భారత్ నౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
చైనా ‘‘వ్యూహాలు’’ అమలు..
ఈ ఘటన అనుకోకుండా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనను దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ, కోస్ట్ గార్డు, మారిటైమ్ మిలీషియా అనుసరిస్తున్న వ్యూహాలను గుర్తుకు తెస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పీన్స్ జలాల్లో చైనా గతంలో ఇలాంటి ఘటనలకే పాల్పడింది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ఇతర దేశాల నౌకలపైకి చైనా నౌకలు వెళ్లడం, వాటికి అడ్డుతగలడం, వాటి మార్గాలను కట్ చేయడం వంటి ఘటనలకు పాల్పడింది. ఇప్పుడు పాక్ నేవీకి చెందిన హునైన్ కూడా ఇలాంటి ఘటనకే పాల్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నేవీ చైనా తయారీ యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు పెద్ద సంఖ్యలు ఉపయోగిస్తోంది. ఇరు దేశాలు తరుచుగా జాయింట్ నేవీ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
పాక్ యుద్ధనౌక డ్యామేజ్..
ఈ ఘటనలో పాకిస్తా్న్ యుద్ధనౌక దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారత కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్ బరువు 7000 టన్నులకు పైగా ఉంటుంది. పాక్ నేవీకి చెందిన పీఎన్ఎస్ హునైన్ సుమారు 2600 టన్నులు ఉండే ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న నౌకలకే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మరింత వేగంగా ఢీకొని ఉంటే పాకిస్తాన్ నౌక మునిగిపోయేదని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్, పాకిస్థాన్ నౌకాదళాల మధ్య ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు 1991లో ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ జలాల్లో ఇరు దేశాల నౌకలు ఒకదానికొకటి మూడు నాటికల్ మైళ్ల కంటే దగ్గరగా వెళ్లకూడదని అందులో ఉంది. అయితే, పాకిస్తాన్ మాత్రం తమను రెచ్చగొట్టే విధంగా భారత్ నౌకనే దగ్గరగా వచ్చిందని పేర్కొంది. ఇది 1991 ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపించింది. 2011లో గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో పాకిస్థాన్ నేవీకి చెందిన పీఎన్ఎస్ బాబర్, భారత నేవీ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ గోదావరి మధ్య ఢీకొన్న ఘటన జరిగింది.
తాజావార్తలు
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!