Site icon NTV Telugu

PM Modi: “కాంగ్రెస్‌కి రిమోట్ కంట్రోల్ పాలన అలవాటు”.. సోనియా గాంధీపై ప్రధాని విమర్శలు..

Pm Modi

Pm Modi

PM Modi: మంగళవారం లోక్‌సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, మరోసారి కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు జోక్యం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి చైర్మన్ జగదీప్ ధంఖర్ నిరాకరించడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

కాంగ్రెస్ మాజీ అధినేత్రి, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గుప్పించడంపై ప్రతిపక్షాల వాకౌట్ జరిగింది. ‘‘ఈ వ్యక్తులు ఆటో పైలట్, రిమోట్ పైలట్‌లో ప్రభుత్వాన్ని నడపడం అలవాటు చేసుకున్నారు. వారికి పనిచేయడంపై నమ్మకం లేదు. ఎలా వేచి ఉండాలో తెలుసు’’ అని ప్రధాని అన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని తెరవెనక నుంచి సోనియాగాంధీ నడిపించారని, రిమోట్ పాలన జరిగిందని పలు సందర్భాల్లో బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని నోటి నుంచి ఈ విమర్శలు వచ్చాయి.

Read Also: Kalki 2898 AD : కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తాము గత 10 ఏళ్లలో కష్టపడి పనిచేశామని, అభివృద్ధి కోసం ఎలాంటి అవకాశాన్ని వదలలేదని పీఎం అన్నారు. గత 10 ఏళ్లలో కేవలం ఎంపరైజర్ మాత్రమే అని, ఇప్పుడు ప్రధాన వింధు ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగిస్తుండగా, ప్రతిపక్షాలు ‘‘అబద్ధాలు చెప్పడం ఆపండి’’, ‘‘దయచేసి సిగ్గుపడండి’’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల తీరుపై ఛైర్మన్ ధంఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ అసత్యాలు వ్యాప్తి చేసే వారికి నిజం వినే ధైర్యం లేదు. ఈ విషయాన్ని దేశం మొత్తం గమనిస్తోంది. వారు సమాధానాలు వింటూ కూర్చోలేరు. వారికి అరవడం తప్ప వేరే మార్గం లేదు. వారు సభా సంప్రదాయాలనను అవమానపరుస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. నినాదాలు చేయడం, కేకలు వేయడం, పారిపోవడం ఇది వారి విధి అని అన్నారు. ఎమర్జెన్సీ గురించి ఈ రోజు ప్రధాని ప్రతిపక్షాలపై దాడిని మరింత తీవ్రం చేశారు.

Exit mobile version