NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ ‘మనీ హేస్ట్’.. 70 ఏళ్లుగా దోచుకుంటోంది..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది. లెక్కల్లో చూపని నల్లధనం గుట్టలు గుట్టలుగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అధికారులు ఆశ్చర్యపోయారు. వీటిని లెక్కించేందుకు పదుల సంఖ్యలో అధికారులు, కౌంటింగ్ మిషన్లు కూడా అలసిపోయాయి. నగదు పాటు 3 కిలోల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ అవినీతికి చిరునామా ఉందని విమర్శిస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘మనీ హేస్ట్’ డ్రామాను ప్రస్తావిస్తూ.. గత 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు.

‘‘ భారతదేశంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు.. మనీహీస్ట్ ఫిక్షన్ ఎవరికి అవసరం.. 70 ఏళ్లుగా దోచుకుంటున్నారు.’’ అంటూ ‘కాంగ్రెస్ మనీ హేస్ట్‌ని ప్రసెంట్ చేస్తోంది’ అనే క్యాప్షన్‌తో బీజేపీ షేర్ చేసిన వీడియోను అటాచ్ చేసి ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించారు. గత రెండు దశాబ్ధాలుగా ఒడిశాలో దేశీ మద్యం వ్యాపారాన్ని చేపట్టేందుకు సాహు సోదరులకు బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని ఒడిశాలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ మాట్లాడుతూ.. బీజేపీ, బీజేపీ నాణేనికి రెండు వైపులా ఉన్నాయని ఆరోపించింది.

Show comments