NTV Telugu Site icon

PM Modi: ఆదివారం వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్‌జే శంకర్ కంటి ఆస్పత్రిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేయనున్నారు.

ఇది కూడా చదవండి: GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..!

వారణాసి కమీషనర్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. అక్టోబర్ 20న వారణాసిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారన్నారు. అలాగే 23 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని చెప్పారు.

ఇది కూడా చదవండి: NTR Devara 2: ఈసారి అంతకు మించి.. ఆ స్టార్స్ కూడా?

 

Show comments