PM Narendra Modi inaugurates Atal Bridge: గుజరాత్లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అహ్మదాబాద్ ‘అటల్ బ్రిడ్జ్’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సబర్మతి రివర్ డెవలప్మెంట్లో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌కు తూర్పు, పడమర వైపుల కలిపే అటల్ బ్రిడ్జిని నిర్మించారు. మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. దాదాపుగా 300 మీటర్ల ఫుల్ ఓవర్ బ్రిడ్జ్.. ప్రత్యేక డిజైన్‌తో నిర్మితం అయింది. ఈ రోజు బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కావడంతో మొత్తం ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు.
కేవలం పాదచారుల కోసం సబర్మతీ నదిపై ఈ వంతెనను నిర్మించారు. నదీ తీరంలో పర్యాటకం అభివృద్ధి చెందడానికి ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. దీంతో పాటు అహ్మదాబాద్ నగరంలోని తూర్పు, పడమరలను కలపనుంది. ఈ వంతెనకు తూర్పు, పడమరల్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కలిగి ఉంది. ఫ్లవర్ పార్కులు, ఆర్ట్-కల్చరల్ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పశ్చిమంగా ఉన్న ఫ్లవర్ పార్కును తూర్పు వైపున ఉన్న ఆర్ట్ కల్చరల్ కేంద్రాలను అటల్ బ్రిడ్జ్ కలుపుతోంది.
JP Nadda : ప్రజా వ్యతిరేక ప్రభుత్వం… ఈ కేసీఆర్ ప్రభుత్వం
భారత స్వాతంత్య్ర పోరాటంలో ఖాదీ గొప్పతనం, దాని ప్రాముఖ్యతను తెలిపేందుకు అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌లో నిర్వహించిన ఖాదీ ఉత్సవ్‌లో కూడా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. గుజరాత్‌లోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 7,500 మంది మహిళా ఖాదీ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఒకే సమయంలో, ఒకే స్థలంలో చరఖా తిప్పి రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమంలో 1920ల నుండి ఉపయోగించిన వివిధ తరాలకు చెందిన 22 చరఖాలను ప్రదర్శించడం ద్వారా ‘చర్ఖాల పరిణామం’ ప్రదర్శనను ప్రదర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగించిన చరఖాలను సూచించే ‘ఎరవాడ చరఖా’ వంటి చరఖాలు, ఈనాడు ఉపయోగిస్తున్న సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతతో కూడిన చరఖాలు ఇందులో ఉన్నాయి. ఖాదీని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఖాదీ ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించడానికి, యువతలో ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. రెండు రోజులు గుజరాత్ పర్యటన చేయనున్న ప్రధాని మోదీ, ఆదివారం 2001 భుజ్ భూకంపంలో మరణించిన వారి పేర్లతో ఏర్పాటు చేసిన స్మృతి వాన్ మెమోరియల్‌ను భుజ్‌లో ప్రారంభించనున్నారు.
Gujarat | On the occasion of 75 years of independence, 7,500 sisters & daughters created history by spinning yarn on Charkha. Spinning Charkha took me back to my childhood days: PM Modi in Ahmedabad pic.twitter.com/4PtzCWW2dg
— ANI (@ANI) August 27, 2022