NTV Telugu Site icon

PM Modi: ఉగ్రవాదంపై పాక్ పీఎంకి ధమ్కీ ఇచ్చిన మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, సీమాంత ఉగ్రవాదానిక మద్దతు ఇచ్చే దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్ లో సభ్యదేశాలతో మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ కడిగిపారేశారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్న సమయంలోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Kia Seltos facelift: కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. క్రెటాకు తిప్పలు తప్పవా.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..?

మోడీ వ్యాఖ్యలతో బిత్తరపోవడం షహబాజ్ షరీఫ్ వంతైంది. ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్ ఎదుర్కొవడానికి నిర్ణయాత్మకపు చర్యలు తీసుకునే అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ప్రాంతీయంగా, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా వ్యతిరేకించాలని సభ్యదేశాలకు పిలునిచ్చారు. వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారి ప్రపంచానికి సవాల్ గా నిలిచాయని.. అన్ని దేశాలకు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం పెద్ద సవాల్ గా ఉందని.. దీన్ని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యంగా కృష్టి చేయాలని అన్నారు.

ఈ ఏడాది ఎస్‌సీఓ సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ రోజు జరిగిన వర్చువల్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ దేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ ఆందోళన చెందుతుందని, భారత్ లాగే ఇతర సభ్యదేశాల పరిస్థితి ఉందని ప్రధాని అన్నారు. ఈ కూటమిలో ఇరాన్ కొత్త సభ్యదేశంగా చేరడాన్ని ప్రధాని స్వాగతించారు. బెలారస్ అధ్యక్షుడు సభ్యత్వం కోసం మోమోరాండం ఆఫ్ ఆబ్లిగేషన్ పై సంతకం చేయడాన్ని కూడా ఆయన స్వాగతించారు.