Site icon NTV Telugu

Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటీష్ వారిని తప్పు పట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్‌లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటిష్ వారిని నిందించడం లేదని, కేంద్ర మంత్రి బాధ్యత వహించారని ఆయన అననారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు భవిష్యత్తును చూసే సామర్థ్యం లేదు.. ఏం అడిగినా వెనక్కు చూస్తారు.. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని అడిగితే.. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ఇలా చేసిందని చెబుతుంటారని ఎద్దేవా చేశారు.

Read Also: CM KCR : బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున మనం నిర్మాణం

ప్రధాని నరేంద్ర మోడీ వెనక అద్దం చూస్తూ భారతదేశం అనే కార్ నడుపుతున్నాడని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించనది విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు గురించి అభివర్ణిస్తూ.. ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య పోరాటమని రాహుల్ గాంధీ అన్నారు. ఒక నాథురామ్ గాడ్సే కోపం, హింస, జీవిత వాస్తవికతను ఎదుర్కోలేక, గాంధీని కాల్చిచంపడానికి కారణం అని అన్నారు. గాంధీజీ ముందు చూసే వాడని, ఆధునికుడు, ఓపెన్ మైండెడ్ అని, గాడ్సే గతంలో గురించి మాట్లాడాడు, భవిష్యత్ గురించి మాట్లాడలేదని, అతను కోపం, ద్వేషంతో ఉన్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై ఆయన డిమాండ్ చేయాలని ట్వీట్ చేశారు.

Exit mobile version