NTV Telugu Site icon

PM Modi: రేపు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Bundelkhand Expressway

Bundelkhand Expressway

ఉత్తరప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ప్రధాని మోదీ రేపు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన్నారు. దీనితో యూపీలో ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రాబోతోంది. ఫిబ్రవరి 29, 2020న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లోనే ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తి కాగా.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ. 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ నాలుగు లేన్లతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబడింది. దీనిని ఆరు లేన్ల వరకు కూడా విస్తరించవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని.. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని పీఎంవో వెల్లడించింది.

ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. శనివారం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సోదరీమణులు, సోదరులకు ప్రత్యేకమైన రోజని.. జలౌన్ జిల్లాలో ఒక కార్యక్రమంలో, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించబడుతుందని.. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ శనివారం జలౌన్ జిల్లా ఒరై తహసీల్‌లోని కైతేరి గ్రామంలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్నారు.

Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ

ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద ఎన్‌హెచ్-35 నుంచి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్దేశిత గడువు కంటే 8 నెలల ముందే పూర్తయింది. ఇక్కడ అది ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలిసిపోతుంది. ఇది చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా మరియు ఇటావాతో సహా ఏడు జిల్లాల గుండా వెళుతుంది. దీనికి 13 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా రూ.1,132 కోట్లు ఆదా చేసింది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం ద్వారా ఢిల్లీ-చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది.