Site icon NTV Telugu

Modi-Trump: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ

Modi

Modi

తనను గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా సానుకూల పరిణామాలను అభినందించారు.

ఇది కూడా చదవండి:Trump: బందీలను విడుదల చేయాలని హమాస్‌ను కోరాం.. లేకుంటే మాత్రం..!

భారత ప్రధాని మోడీతో మంచి స్నేహం ఉందని.. ఆయన గొప్ప ప్రధానమంత్రి అని ట్రంప్ అన్నారు. ఇద్దరం ఎల్లప్పుడూ స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. కాకపోతే ఈ ప్రత్యేక సమయంలో మోడీ చేస్తున్నదే తనకు నచ్చడం లేదన్నారు. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న బంధం మాత్రం చాలా ప్రత్యేకమైందని వెల్లడించారు. చింతించాల్సిన పని లేదని.. అప్పుడప్పుడు విభేదాలు సహజంగా జరుగుతుంటాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Ajit Pawar: అజిత్ పవార్ తో వివాదం.. ఐపీఎస్ సర్టిఫికెట్లపై దర్యాప్తుకు డిమాండ్.. ఎన్సీపీ నేత యూపీఎస్సీకి లేఖ

ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ మోడీ కీలక పోస్ట్ చేశారు. తమ సంబంధాలపై ట్రంప్ భావాలను అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా బంధం చాలా సానుకూలమైందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉంటామని మోడీ పేర్కొన్నారు.

చైనా కారణంగా భారత్, రష్యాను కోల్పోయామని.. ఆ రెండు దేశాలు చైనా చీకటిలోకి వెళ్లిపోయాయని ఇటీవల చైనాలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను తన సొంత సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై ఓవల్ కార్యాలయంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. మోడీ మంచి స్నేహితుడని.. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించినట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై అత్యధికంగా 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Exit mobile version