NTV Telugu Site icon

PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్‌క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు

Pmmodi

Pmmodi

21వ శతాబ్దంలో జన్మించిన తరం ‘అమృత తరం’ కానుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. షెరింగ్ టోబ్గేతో కలిసి కాన్‌క్లేవ్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ నాయకులను పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: Return of the Dragon Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ ఇంకో హిట్ కొట్టాడా ?

ఎమర్జింగ్ ఇండియాకు రాజకీయాల్లోనే కాకుండా ప్రతి రంగంలోనూ కొత్త నాయకులు అవసరమని మోడీ వ్యాఖ్యానించారు. కొత్త నాయకత్వం కోసం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రేరణ పొందాలని సూచించారు. ఈ ప్రేరణతో అన్ని రంగాల్లో కొత్త నాయకత్వాన్ని సృష్టించడానికి సాయపడుతుందని అభిప్రాయపడ్డారు.గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు మనం కొత్త నాయకత్వాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విక్షిత్ భారత్‌కు అవసరమైన స్ఫూర్తిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ ఆలోచనలతో ముందుకు సాగితేనే విక్షిత్ భారత్ సాధ్యమవుతుందని మోడీ పేర్కొన్నారు.