Site icon NTV Telugu

PM Modi: ఇథియోపియాలో మోడీకి ప్రత్యేక గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం

Modi

Modi

ఇథియోపియాలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం లభించింది. తొలిసారి ఇథియోపియాలో పర్యటించిన ప్రధాని మోడీకి ప్రత్యేక గౌరవాన్ని కనుపరిచారు. ఆద్యంతం ఇథియోపియా నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా మోడీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో సత్కరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇక బుధవారం ఇథియోపియా పార్లమెంటును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా మోడీ పంచుకున్నారు. ‘నాకు చాలా గౌరవంగా అనిపించింది. ఇథియోపియా గొప్ప చరిత్ర, సంస్కృతి, స్ఫూర్తి లోతైన గౌరవం. ప్రశంసలు ప్రేరేపించాయి. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం, శాంతి, అభివృద్ధి. సహకారం కోసం ఉమ్మడి దృక్పథంతో మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం నిబద్ధతను నేను తెలియజేసాను. ఇథియోపియా పార్లమెంటులో ప్రసంగం తర్వాత ఆ దేశ మంత్రులు, పార్లమెంటు సభ్యులతో సంభాషించడం నాకు చాలా ఆనందంగా ఉంది.’’’అంటూ మోడీ రాసుకొచ్చారు.

ఇక అంతకముందు జోర్డాన్‌లో కూడా ప్రధాని మోడీకి ఆత్మీయ ఆతిథ్యం లభించింది. యువరాజు అల్‌ హుసేన్‌ బిన్‌ అబ్దుల్లా-2తో కలిసి తిరిగారు. స్వయంగా కారు నడుపుతూ మోడీని చారిత్రక జోర్డాన్‌ మ్యూజియానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా మోడీ పంచుకున్నారు. జోర్డాన్, ఇథియోపియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. జోర్డాన్, ఇథియోపియా తర్వాత ఒమన్‌లో పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: Messi-Vantara: వంతారాను సందర్శించిన మెస్సీ.. ఫొటోలు వైరల్

 

Exit mobile version