PM Modi: నీట్-యూజీసీ విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలుగొద్దని ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో విమానాశ్రయంలోనే 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు. పరీక్షా సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడొద్దని ప్రధాని ఇలా చేశారు. ప్రధాని మధ్యామ్నం 1.15 గంటలకు బెంగాల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉన్నందున, వెంటనే తన నివాసానికి వెళ్లకుండా ఎయిర్‌పోర్టులోనే కొంత సమయం ఉన్నారు. తన కాన్వాయ్, ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా ప్రారంభమైన తర్వాత, ప్రధాని మోడీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు.
అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల నీట్ రీ-ఎగ్జామ్ జరుగుతోంది. ఈ పరీక్ష కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. భారతదేశంలోని 5,440 కేంద్రాలలో మరియు విదేశాల్లోని 14 కేంద్రాలలో 22 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ విస్తృత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. . 95,000కు పైగా పరీక్షా గదులను 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు, వీటికి ఏఐ (AI) ఆధారిత నిఘా కూడా తోడవుతోంది. అదే సమయంలో, ఎలక్ట్రానిక్ మోసాలను నివారించడానికి 51,000కు పైగా సిగ్నల్ జామ్మర్‌లను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా జరిగేందుకు భద్రతా ఏర్పాట్లలో 6700 మంది పరిశీలకులు, 100 మందికి పైగా వర్చువల్ మానిటర్లు, దాదాపు 39 వేల మంది ఫ్రిస్కింగ్ సిబ్బంది, 48 వేలకు పైగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.

