PM Narendra Modi: మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ కీలక ప్రకటన..

  • ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రకటన..
  • మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
  • మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలోమోడీ ఓ ప్రకటన..
Pm Modi

Pm Modi

PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేయబోతున్నారు.. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తొలిసారిగా పార్లమెంటులో స్పందించనున్న ప్రధాని, దేశానికి సంబంధించిన భద్రతా చర్యలు, భవిష్యత్ సవాళ్లపై వివరించనున్నట్లు సమాచారం.

ప్రధాన అంశాలు:
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం
దేశ భద్రత కోసం తీసుకుంటున్న ముందస్తు చర్యలు
చమురు నిల్వలు, ఇంధన భద్రతపై సమగ్ర ప్రణాళిక
ప్రజలపై ఆర్థిక భారం పడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సహచర కేబినెట్‌ మంత్రులతో కలిసి చమురు నిల్వలు, ఇంధన సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఇంధన కొరత లేకుండా చూసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వినియోగదారులపై ప్రభావం తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు సమాచారం.

లోకసభలో కీలక ప్రసంగం:
ఇలాంటి సమయంలో లోకసభలో ప్రధాని మోడీ చేసే ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మధ్యప్రాచ్య పరిణామాల ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుందో, దాన్ని ఎలా ఎదుర్కొంటామనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా, ప్రధాని మోడీ ప్రసంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ప్రజలు, మార్కెట్లు, పరిశ్రమలు ఈ ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. గతంలో కీలక సమయాల్లో ప్రధాని మోడీ ప్రసంగించినప్పుడు.. ఎన్నో కొత్త పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం.. మరి ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది..