World’s largest office building: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మనదేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఈ బిల్డింగ్ నిర్మించబడింది. కొత్తగా నిర్మించింది. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి, దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2015లో ప్రారంభమైంది.
ఈ ఏడాది ఆగస్టులో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్(డ్రీమ్) సిటీలో భాగంగా ఉన్న ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 35.54 ఎకరాల ప్లాట్‌లో నిర్మించిన ఈ భారీ బిల్డింగ్ తొమ్మిది టవర్లతో పాటు 15 అంతస్తులను కలిగి ఉంది. 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్థలాలు ఉన్నాయి. 9 దీర్ఘచతురస్రాకార టవర్లు సెంట్రల్ స్పైన్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ భవనానికి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) నుంచి ప్లాటినం ర్యాంకింగ్ పొందింది.
Read Also: Nirmala Sitharaman: వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
డిసెంబర్ 17న భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 70,000 మందికి ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే గత కొన్ని వారాలుగా పలు వజ్రాల వ్యాపార సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయి, 65,000 మంది వజ్రాల నిపుణులకు అనుకూలంగా ఈ భవనం ఉండబోతోంది. ఆఫీసులతో పాటు, డైమండ్ బోర్స్ క్యాంపస్‌లో సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్‌లు, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, ట్రైనింగ్ సెంటర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాలు, రెస్టారెంట్లు మరియు సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి