PM Modi: బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ప్రధాని మోదీ శనివారం(జులై 16) రోజున బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన్నారు. దీనితో యూపీలో ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రాబోతోంది. ఫిబ్రవరి 29, 2020న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లోనే ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తి కాగా.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ. 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ నాలుగు లేన్లతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబడింది. దీనిని ఆరు లేన్ల వరకు కూడా విస్తరించవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని.. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని పీఎంవో వెల్లడించింది.
Delhi: బ్యాగుల నిండా తుపాకులే.. భార్యాభర్తలు అరెస్ట్
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద ఎన్‌హెచ్-35 నుంచి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్దేశిత గడువు కంటే 8 నెలల ముందే పూర్తయింది. ఇక్కడ అది ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలిసిపోతుంది. ఇది చిత్రకూట్, బందా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా మరియు ఇటావాతో సహా ఏడు జిల్లాల గుండా వెళుతుంది. దీనికి 13 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా రూ.1,132 కోట్లు ఆదా చేసింది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం ద్వారా ఢిల్లీ-చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది.
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!