Delhi: బ్యాగుల నిండా తుపాకులే.. భార్యాభర్తలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిద్దరు జగ్‌జిత్ సింగ్, జస్విందర్ కౌర్‌లుగా గుర్తించారు. వారిద్దరినీ హర్యానాకు చెందిన భార్యాభర్తలుగా నిర్ధారించారు. వీరితో పాటుగా 17 నెలల కుమార్తె కూడా ఉంది. ఈ జంట జులై 10న వియత్నాం నుండి ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది అవి నిజమైన తుపాకులేనని తెలిపారు.
Jaggery Destroy: వాగులో బంగారం….ఎందుకో తెలుసా?
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
జగ్‌జిత్ సింగ్ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 తుపాకులు ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తుపాకులపై ఆరా తీశారు. అయితే ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి విమానంలో వియత్నాం వచ్చిన తన సోదరుడు మంజిత్ సింగ్ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్‌జిత్ సింగ్ తెలిపాడు. అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు. 45 తుపాకుల విలువ సుమారుగా రూ. 22 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దంపతులను కస్టమ్స్ ఏసీ సెక్షన్ 104 కింద అరెస్టు చేయగా, బిడ్డను వారి అమ్మమ్మకు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..