NTV Telugu Site icon

PM Modi: పరీక్షా పే చర్చలో భాగంగా కాసేపట్లో విద్యార్థులకు చిట్కాలు చెప్పనున్న మోడీ

Pmmodi

Pmmodi

దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్ ప్రారంభించేశారు. అయితే పరీక్షల సమయంలో ప్రతి ఏడాది ప్రధాని మోడీ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం అయి కొన్ని చిట్కాలు ఇస్తుంటారు. ఇందులో భాగంగా సోమవారం పరీక్షా పే చర్చలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 5 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌.. సచిన్‌ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్!

ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై విద్యార్థులు, తల్లిదండ్రులతో మోడీ సమావేశం కానున్నారు. ఇందుకోసం మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పరీక్షలు ముగింపు కాదు. కొత్త ప్రారంభం. పరీక్షల ఒత్తిడి లేకుండా చేద్దాం! మీ అందరినీ ఉదయం 11 గంటలకు కలుస్తా’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Lok Sabha: నేడు లో‌క్‌సభ ముందుు కొత్త ఆదాయపు పన్ను బిల్లు!

పరీక్షా పే చర్చలో భాగంగా దేశం నలుమూలల నుంచి సీబీఎస్‌‌ఈ, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రధానంగా విద్యార్థులు పరీక్ష ఒత్తిడి ఎలా జయించాలన్న విషయంపై సూచనలు, సలహాలు మోడీ ఇవ్వనున్నారు. అంతేకకుండా ఉపాధ్యాయులతో కూడా మోడీ సంభాషించనున్నారు. ఒత్తిడి లేని పరీక్షలు, మానిసక ఆరోగ్యం, విజయ వ్యూహాలపై చిట్కాలు ఇవ్వనున్నారు. ఇక క్రీడలు, క్రమశిక్షణా సెషన్‌లో ఎంసీ మేరీ కోమ్, అవని లేఖరా, సుహాస్ యతిరాజ్ పాల్గొంటారు. మానసిక ఆరోగ్యంపై దీపికా పదుకొనే మాట్లాడనున్నారు.