NTV Telugu Site icon

Naval Ships: రేపు నేవీలోకి మరో మూడు యుద్ధనౌకలు.. జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని

Navy

Navy

Naval Ships: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను రేపు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం మరింత పెరగనుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే లక్ష్యం దిశగా సాగుతున్న భారత్‌కు ఇది పెద్ద ముందడుగు అని వెల్లడించారు.

Read Also: Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్..

ఇక, ఐఎన్‌ఎస్‌ సూరత్‌.. పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద నాలుగో యుద్ధనౌకను అభివృద్ధి చేస్తున్నారు. ఇది, ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో ఒకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ-సెన్సర్‌ వ్యవస్థలు సైతం పని చేస్తాయి. నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం దీని సొంతం అని చెప్పాలి. అలాగే, ఐఎన్‌ఎస్‌ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌకగా నిలవనుంది. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇక, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌.. పీ75 కింద తయారు చేస్తున్న ఆరో, చివరి జలాంతర్గామిగా చెప్పుకొవాలి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహకారంతో దీన్ని డెవలప్మెంట్ చేశారు.

Show comments