Site icon NTV Telugu

Security Cabinet Meeting: నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ.. భద్రతా వ్యవహారాలపై చర్చ!

Modi

Modi

Security Cabinet Meeting: 26 మంది భారతీయుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా సుమారు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. భారత్ సైన్యం చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ షాక్ అయింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరితో ఒక్కసారిగా ప్రపంచదేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు ప్రధాని మోడీ నివాసంతో సీసీఎస్ కేబినెట్ భేటీ జరగనుంది.

Read Also: Maranamass: రేపటి నుంచి సోనీ లివ్‌లో ‘మరణ మాస్’ స్ట్రీమింగ్‌

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో భవిష్యత్తులో జరిగే ఏవైనా చర్చలు పీవోకే, ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై మాత్రమే దృష్టి సారించేలా ఉండాలని ప్రధాని మోడీ తెలిపే ఛాన్స్ ఉంది.

Read Also: APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. విచారణలో స్పీడ్‌ పెంచిన పోలీసులు..

ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు, జాతీయ భద్రతా అధికారులు పాల్గొంటారు. భారతదేశ దౌత్య, రక్షణ శాఖ వైఖరిని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ప్రధాని మోడీ సూచనలు చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భద్రత, అంతర్జాతీయ సంబంధాల పట్ల భారత్ తన విధానాన్ని పునర్నిర్వచించుకోవడాన్ని ప్రయత్నిస్తుంది.

Exit mobile version