NTV Telugu Site icon

Mumbai: మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ.. విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు

Modi

Modi

ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. వారితో అనేక విషయాలు ముచ్చటించారు. అంతేకాకుండా ‘లాడ్కీ బహిన్‌’ పథకం లబ్ధిదారులు, కార్మికులతో కూడా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మెట్రో రైలుతో పాటు మెట్రో కనెక్ట్‌-3 యాప్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, సీఎం ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్‌, అజిత్‌ పవార్‌లు ప్రధాని వెంట ఉన్నారు. బీకేసీ- ఆరే మధ్య మొత్తం పది మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, సహర్ రోడ్ సహా మరి కొన్ని ప్రాంతాలను ఈ మార్గం కలుపుతుంది.

ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా అధికారం కోసం ఛేజ్కించుకోవాలని ఆశపడుతోంది. ఈ రెండు కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.