Site icon NTV Telugu

PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ

Modi2

Modi2

భారత వాయుసేన చూపించిన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను మోడీ కలిశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించారు. శత్రువులకు భారత వాయుసేన వెన్నులో వణుకు పుట్టించిందని.. అందుకే ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేసినట్లు తెలిపారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమైపోయిందన్నారు. అందుకే భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi Speech: ప్రధాని మోడీ ‘‘ఆపరేషన్ సిందూర్’’ స్పీచ్‌పై ప్రపంచ మీడియా ఏం చెప్పిందంటే..

భారత వాయుసేన చూపించిన ప్రతిభ.. భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారని.. అలాగే ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీ వెంట ఉన్నాయని వాయుసేనను ఉత్తేజ పరిచారు. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుందని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ సాధారణమైన సైనిక విన్యాసం కాదని.. ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనం అని ప్రధాని మోడీ కొనియాడారు.

ఇది కూడా చదవండి: PM Modi: పాక్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారు

 

Exit mobile version