Site icon NTV Telugu

PM Modi: ఎలాన్‌ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్‌.. ముచ్చటెందంటే!

Modi

Modi

PM Modi: టారిఫ్‌ల విషయంలో భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్ లోని డోజ్‌ విభాగ అధిపతి, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ప్రధాని తెలియజేశారు.

Read Also: Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల ముందు లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు..

అయితే, ఎలాన్‌ మస్క్ తో పలు కీలక అంశాలపై చర్చించాను.. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌లో మా సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలనూ మేం ప్రస్తావించామని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇక, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై ఇరువురం చర్చించాం అన్నారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇక, భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి టెస్లా ప్రవేశించడానికి గల అవకాశాలపై ఎలాన్ మస్క్- ప్రధాని మోడీల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది.

Exit mobile version