PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..

  • మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు, చొక్కాలు విప్పడం ఎందుకు..
  • కాంగ్రెస్ ఏఐ సమ్మిట్ నిరసనపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు..
Pm Modi

Pm Modi

PM Modi: ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి నిరసనలు చేయడాన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం మీరట్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నాయకులు మోడీని ద్వేషిస్తారు, వారు నా సమాధిని తవ్వాలని కోరుకుంటారు. వారు నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాడరు’’ అని అన్నారు.

Read Also: PM Narendra Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రజలతో కలిసి ప్రయాణం!

‘‘AI గ్లోబల్ సమ్మిట్ BJP కార్యక్రమం కాదని, ఆ సమయంలో ఏ BJP నాయకుడూ హాజరు కాలేదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది జాతీయ కార్యక్రమం, దేశం కోసం ఉద్దేశించిన కార్యక్రమం’’ అని అన్నారు. భారతదేశ సాంకేతిక ఆశయాలను ప్రదర్శించడానికి ఉద్దేశించిన కార్యక్రమ మర్యాదను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కాంగ్రెస్ పార్టీ “అవినీతి రాజకీయ సంస్కృతి”ని ప్రతిబింబిస్తుందని, దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సంఘటనను ఖండిస్తున్నారని ప్రధానమంత్రి ఆరోపించారు.

కాంగ్రెస్ డర్టీ, నగ్న రాజకీయాల కోసం ప్రపంచ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారని, ఇది ఆ పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాళా తీసిందని, దరిద్రమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారని ఇప్పటికే దేశం మొత్తానికి తెలుసు, మరీ మీ బట్టలు విప్పాల్సిన అవసరం ఏందుకు కలిగింది.?అని అడిగారు. భారతదేశ విజయాన్ని చూడలేని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నాయని, కాంగ్రెస్ తన సొంతదేశాన్ని కించపరడంలో బిజీగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.