PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
- రేపు దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ
- కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటన
- హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఆదివారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ సభలో ప్రసంగించనున్నారు.
ఉదయం 11 గంటలకు కర్ణాటకలో నిర్వహించనున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. సమాజ సేవ లక్ష్యంగా వివిధ రంగాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సుమారు రూ.9500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, లాజిస్టిక్స్, వస్త్ర పరిశ్రమ, రైల్వేలు, ఇంధన రంగం తదితర విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అలాగే సింధు ఆస్పత్రిని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
హైదరాబాద్ టూర్ నేపథ్యంలో మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలన.. ఇప్పుడు కాంగ్రెస్ దుష్పరిపాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాకు పెరుగుతున్న మద్దతును బట్టి చూస్తే.. తెలంగాణ ప్రజల మొదటి ఎంపిక మా పార్టీయే.’’ అని మోడీ పేర్కొన్నారు.
Tomorrow, 10th May, I will be attending various programmes in Karnataka and Telangana.
At 11 AM tomorrow, I will join the programme to mark the 45th anniversary celebrations of the establishment of the Art of Living. In line with our ethos of serving society, they have been…
— Narendra Modi (@narendramodi) May 9, 2026
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?