Site icon NTV Telugu

PM Modi: పహల్గామ్‌కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్‌కు బుద్ధి చెప్పాం

Pmmodi

Pmmodi

పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే దాయాది దేశం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పినట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు రుజువులు అడుగుతున్నాయని.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో చేసిన వైమానిక దాడులపై కూడా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయని.. కానీ ఈసారి మాత్రం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను అంతం చేసినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Karnataka: ముస్లిం ఐఏఎస్‌పై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ పలు కఠి నిర్ణయాలు తీసుకుంది. పాక్‌కు సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్‌లో పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాళ్లు బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!

ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని భారత్‌పై పాకిస్థాన్ యుద్ధం చేస్తుందన్నారు. అందుకే భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 75 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలా భరిస్తూనే ఉండాలా? అందుకే పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. భారత్.. శాంతిని నమ్ముతుందని.. కానీ పదే పదే రెచ్చగొడితే మాత్రం.. తిరిగి దాడికి చేయడానికి భారత్ వెనుకాడదని హెచ్చరించారు. భారత్ కూడా యోధుల భూమి అని ప్రపంచానికి గుర్తు చేయాలన్నారు.

 

Exit mobile version