NTV Telugu Site icon

PM Modi: జామ్‌నగర్ ఫారెస్ట్ వీడియో పోస్ట్ చేసిన మోడీ.. కనువిందు చేస్తున్న జంతువులు

Modi

Modi

ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ నిర్మించిన వంటారా జంతు రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వివిధ జంతువులతో మోడీ సరదాగా గడిపారు. దాదాపు 2 వేలకు పైగా జంతువులకు ఈ ఫారెస్ట్‌లో పునరావాసం కల్పించారు. ప్రధాని మోడీకి అనంత్ అంబానీ.. జంతువుల వివరాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా అనంత్ అంబానీ కృషిని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Yogi Adityanath: మతపరమైన అంశాలతో ఆడుకుంటున్నారు.. సమాజ్‌వాదీ పార్టీపై యూపీ సీఎం ఫైర్

ఇక ఈ వీడియోలో మోడీ.. సింహ పిల్లలు, తెల్ల సింహ పిల్లలు సహా వివిధ జాతులకు ఆహారం పెడుతూ, ఆడుకుంటూ కనిపించారు. వంటారాలో 2 వేలకు పైగా వివిధ జంతువులు ఉన్నాయి. ఇక ఆయా జాతులకు సంబంధించిన అంతరించిపోతున్న జంతువులు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఇక జంతువుల సంరక్షిణ కోసం ఆస్పత్రులు, వైద్యులు ఉన్నారు. అంతేకాకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఐసీయూలు, వివిధ సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా వన్యప్రాణుల అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, దంతవైద్యం, అంతర్గత వైద్యం వంటి బహుళ విభాగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి: Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే