PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
- పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తి
- పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
- ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రధాని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తైంది. కుటుంబాలతో పహల్గామ్‌లో విహరిస్తుండగా హఠాత్తుగా ఉగ్ర మూకలు విరుచుకుపడి మతం పేరుతో 26 మంది పురుషులను పొట్టనపెట్టుకున్నారు. ఏడాది నుంచి 26 కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ పహల్గామ్ బాధితులను స్మరించుకున్నారు. బాధితులకు నివాళి అర్పించారు. గతేడాది ఇదే రోజున పహల్గామ్ ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. వారిని ఎప్పటికీ మరిచిపోలేమని.. నష్టపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుఃఖంలోనూ.. సంకల్పంలోనూ ఒక దేశంగా ఐక్యంగా ఉన్నామన్నారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదానికి తలొగ్గదని.. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావన్నారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
గతేడాది ఇదే రోజున హిందువులను టార్గెట్‌గా చేసుకుని 26 మంది పురుషులను ఉగ్రవాదులు చంపేశారు. భార్య, పిల్లల ముందే చంపేశారు. కొత్తగా పెళ్లైన జంటలను కూడా వదిలిపెట్టకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. మొత్తానికి నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం పహల్గామ్‌లో కాల్పులకు తెగబడ్డ ముష్కరులను కూడా భద్రతా దళాలు అంతమొందించాయి.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!