జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోన్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో యోగా ఓ ఆశాకిరణంలా నిలిచిందని, కరోనా సమయంలోనూ ప్రజలు ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు.
Read: నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన
చాలా పాఠశాలలు ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు నిర్వహించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ఇక నెగిటివిటితో యుద్ధం చేయడానికి యోగా ఉపయోగపడుతుందని అన్నారు. యోగా కరోనాతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుందని ప్రధాని మోడి ఈ సందర్భందా తెలిపారు. 2015 నుంచి జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
