నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన

నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై ఈ మ్యూజిక్‌ వీడియోను నాని సమర్పణలో ఛాయ్‌ బిస్కెట్‌ ఈ సాంగ్‌ ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కి ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్‌ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుదల చేశారు.

Also Read : ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ”

కరోనా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ వేవ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాల‌తో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ కు ఈ పాటను అంకితమిచ్చారు. తాజాగా ఈ సాంగ్ కు 1.5 మిలియన్ వ్యూస్, 120కేకు పైగా లైక్స్ రావడం విశేషం. మీరు కూడా ఏఎస్ సాంగ్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-