PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- ‘అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి’
- నవరాత్రిపై ప్రధాని మోడీ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Navratri Wishes 2026: శారదీయ నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి తొలి రోజైన ఆదివారం అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు, ఆరోగ్యం వెల్లివిరియాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. దేశ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. నవరాత్రి ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. శక్తి ఆరాధనకు అంకితమైన నవరాత్రి మహోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మాతా జగదాంబ కృపతో ప్రజల జీవితాల్లో సుఖం, శాంతి, సమృద్ధి, ఆరోగ్యం నిండాలని ఆకాంక్షించారు. ఈ ఆశీస్సులు దేశ ఐక్యతను, అభివృద్ధి సంకల్పాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. మరో పోస్టులో నవరాత్రి తొలి రోజు పూజలందుకునే మా శైలపుత్రి దేవి పాదాలకు నమస్కరించారు. అమ్మవారి దివ్య అనుగ్రహంతో ప్రతి ఒక్కరిలో సహనం, ఆత్మవిశ్వాసం పెంపొందాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ప్రార్థించారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ప్రకృతి పట్ల గౌరవం, దృఢ సంకల్పానికి ప్రేరణ: రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా శారదీయ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి తొలి రోజున మా శైలపుత్రి దేవికి కోట్లాది నమస్కారాలు అర్పించారు. అమ్మవారి దివ్య స్వరూపం ప్రకృతి పట్ల గౌరవాన్ని కలిగి ఉండటంతో పాటు జీవితంలో దృఢంగా నిలబడటానికి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజల జీవితాల్లో సుఖం, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
నవరాత్రుల్లో మా శైలపుత్రి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం
నవరాత్రి పండుగలో మొదటి రోజున దుర్గాదేవి తొలి రూపమైన మా శైలపుత్రిని పూజిస్తారు. భక్తులు ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తూ ధైర్యం, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యే వేళ, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
शक्ति-साधना के महापर्व नवरात्रि की सभी देशवासियों को कोटि-कोटि शुभकामनाएं।
मां जगदंबा की कृपा से सबके जीवन में सुख, शांति, समृद्धि और आरोग्य का वास हो, जो राष्ट्र की एकता एवं प्रगति के संकल्प को और सशक्त करे। https://t.co/EMCysLIqcs
— Narendra Modi (@narendramodi) October 11, 2026
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..