Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీ పర్యవేక్షణలోనే ఆపరేషన్ సింధూర్..

Modi

Modi

PM Modi: పాకిస్తాన్ పై దాడులు తప్పవని ఇండియన్ గవర్నమెంట్ గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. దీనికి పాకిస్తాన్ సైన్యం కూడా స్పందించింది. భారత దాడులు అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగింది. ఈ కాల్పులకు భారత ఆర్మీ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరో వైపు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైతుంది వాయు రక్షణ వ్యవస్థ.

Read Also: Operation Sindoor : భారత దాడిలో జైషే టాప్ కమాండర్ హతం..!

అయితే, ఈ మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. భారత ఆర్మీకి సపోర్టుగా నిలిచారు. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు తెలియజేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ పై వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన రిలీజ్ చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని వెల్లడించారు. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడారు. దాడిపై అతడికి అన్ని విషయాలను వివరించారు.

Exit mobile version