NTV Telugu Site icon

PM Modi Ukraine Tour: ఆగస్టు 23న ఉక్రెయిన్కు ప్రధాని మోడీ..?

Ukrine

Ukrine

PM Modi Ukraine Tour: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా, వారంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని సైనికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23వ తేదీన ఉక్రెయిన్‌లో పర్యటించబోతున్నట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశం కానున్నట్లు టాక్. రష్యాతో యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌లో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

Read Also: Tollywood talk: ఫ్లాపుల తర్వాత వస్తోన్న కాంబీనేషన్ కు కిరాక్ డీల్..!

అయితే, గత నెలలో రష్యాలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాతే ఉక్రెయిన్ పర్యటనను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు నెల రోజుల క్రితం ఇటలీలో జరిగిన జీ-7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ జెలెన్స్కీని కలిశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ పర్యటనకు వస్తాను అని మోడీ మాట ఇచ్చినట్లు తెలుస్తుంది.