Site icon NTV Telugu

Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం.. జనవరి 13 నుంచి ప్రారంభం..

Pm Modi

Pm Modi

Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.

Read Also: Ram Mandir: ముస్లిం కరసేవకుడికి రామాలయ ఆహ్వానం.. ఎన్నో ఏళ్ల తపస్సు అని హబీబ్ భావోద్వేగం..

బీహార్‌లో మొత్తం 40 ఎంపీ స్థానాల్లో విజయాన్ని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి, ఫిబ్రవరిలో బీహార్‌లో పలు ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. జనవరి15 తర్వాత కీలక ర్యాలీలు జరిగే అవకాశం ఉంది. బీహార్‌లోని బెగుసరాయ్, బెట్టియా, ఔరంగాబాద్‌లో జరిగే మూడు ర్యాల్లీలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అదేవిధంగా, అమిత్ షా జనవరి మరియు ఫిబ్రవరిలో సీతామర్హి, మాధేపురా మరియు నలందలో సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జెపి నడ్డా అనేక చోట్ల, ముఖ్యంగా బీహార్‌లోని సీమాంచల్ మరియు తూర్పు ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించవచ్చు.

గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఇప్పుడు ఆర్జేడీతో బంధాన్ని ఏర్పరుచుకుంది. ఇక సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత ఎన్నికల్లో బీజేపీ+జేడీయూ 40 ఎంపీ స్థానాల్లో 39 స్థానాలను కైవసం చేసుకుంది, కాంగ్రెస్ ఒకేస్థానానికి పరిమితమైంది. అయితే ఈ సారి జేడీయూ లేకుండా బీజేపీ ఒంటరిపోరు చేస్తోంది. దీంతో ఈ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి చెప్పింది.

Exit mobile version